మరోసారి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు..హైదరాబాద్‌ ప్రయాణికులకు రిలీఫ్‌ !

-

తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. త‌క్కువ దూరం ప్ర‌యాణీకుల‌పై భారం ప‌డ‌కుండా స్లాబ్‌లు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ప్ర‌యాణించే ప్ర‌యాణీకుల‌కు మిన‌హాయింపులు కూడా ఇచ్చేందుకు రంగం సిద్దం చేసింది ఆర్టీసీ.

తెలంగాణ ఆర్టీసీలో మరోసారి డీజిల్ సెస్ పెంపు ఉందని.. నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అధ‌న‌పు డీజిల్ సెస్ వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, వి.సి అండ్ ఎం.డి వి.సి.స‌జ్జ‌నార్‌ ప్రకటించారు.

ప‌ల్లెవెలుగు – 250 కి.మీ దూరంన‌కు రూ.5 నుంచి 45 రూపాయల పెంపు ఉండనుండగా.. ఎక్స్ ప్రెస్‌ – 500 కి.మీ వరకు దూరంన‌కు రూ.5 నుంచి రూ.90, డీల‌క్స్‌ – 500 కి.మీ వరకు దూరంన‌కు రూ.5 నుంచి రూ.125, సూప‌ర్ ల‌గ్జ‌రీ – 500 కి.మీ వరకు దూరంన‌కు రూ.10 నుంచి రూ.130, ఏసీ స‌ర్వీసులు – 500 కి.మీ వరకు దూరంన‌కు రూ.10 నుంచి రూ.170, పెంపు ఉండనున్నట్లు చెప్పారు ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌,వి.సి అండ్ ఎం.డి వి.సి.స‌జ్జ‌నార్‌. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపులేదని.. బస్సుల్లో ప్రయాణించే ఈ ప్రయాణికులకు ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news