రేషన్‌ కార్డు దారులకు తెలంగాణ శుభవార్త..అప్పటి వరకు ఉచిత బియ్యం

-

రేషన్‌ కార్డు దారులకు శుభవార్త చెప్పారు మంత్రి గంగుల కమలాకర్‌ రావు. కేంద్రం కన్నా ముందే కోవిడ్ సంక్షోభంలో ప్రజలకు ఉచితంగా బియ్యం, డబ్బులు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. 5216 కోట్లను కేవలం కోవిడ్ సంక్షోభంలో ఆహార భద్రతకు కేటాయించిన రాష్ట్రం మనేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 90.46 లక్షల కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డులకు మాత్రమే కేంద్రం ఐదు కిలోల పంపిణీ చేశారని.. మిగతా కార్డులకు పూర్తిగా రాష్ట్రమే అందిస్తుందన్నారు.

ఈ నెల నుండి డిసెంబర్ వరకూ ఉచిత బియ్యం అందిస్తామని.. 18 నుండి 26 వరకూ 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. 40 కోట్ల 63 లక్షల ధాన్యం బ్యాగుల్లో ఎప్.సి.ఐ సరిగా లేవన్నవి 0.7 శాతమని.. 40 మిల్లుల్లో షార్టేజీ ఉందని మొదట అన్న ఎప్.సి.ఐ తర్వాత తనిఖీల్లో 30 మిల్లులు సరిగానే ఉన్నాయని చెప్పారు. పది మిల్లుల్లో రెండింటిపై క్రిమినల్ కేసులు, మూడింటి నుండి 125 శాతం రికవరి చేసామని.. ఒక్కగింజను వదులకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత రానీయమని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news