ఇదెక్కడి మాస్‌రా మావా..! నెలల తరబడి నిద్రపోతున్న గ్రామస్థులు..కారణం కనుక్కోలేకపోతున్న సైంటిస్టులు

-

జనరల్‌గా నిద్రపోతే మైండ్‌ ఫ్రష్‌గా ఉంటుంది అంటారు.. అవును కంటి నిండా నిద్రపోతే.. యాక్టీవ్‌గా ఉండి.. పనులన్నీ బాగా చేసుకోగలుగుతాం.. కానీ అక్కడి వారు నిద్రపోతే.. మనలా 7-8 గంటలు మాత్రమే పడుకోరు. నెలల తరబడి నిద్రపోతూనే ఉంటారు. ఇలా ఒకరు ఇద్దరూ కాదండోయ్.. మొత్తం ఊరంతా ఇదే పరిస్థితి. ఇంకో హైలెట్‌ ఏంటంటే.. వీళ్లు నిద్రపోయిన తర్వాత గతం మర్చిపోతారట. ఒక ప్లేసు అని లేకుంకడా.. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ కనిపిస్తారు. మన దగ్గర తాగినోళ్లు ఎక్కడపడితే అక్కడ పడిపోయి ఉంటారు కదా.. అలా వీళ్లు నిద్రపోతుంటారట.. ఇంతకీ ఏ గ్రామం, ఎందుకు వీళ్లు ఇలా నిద్రపోతున్నారో చూద్దామా..!

కజకిస్తాన్‌లోని కలాచి గ్రామంలోని ప్రజలు సుదీర్ఘంగా నిద్రపోతుంటారు. అందుకనే ఈ గ్రామాన్ని స్లీపీ హాలో అని పిలుస్తారట. ఈ విచిత్రమైన గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. దాదాపు 160 మంది నిద్రపోతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిద్రపోయిన తర్వాత గ్రామస్తులు గతంలో జరిగినదంతా మర్చిపోతారట.

వీళ్లు.. బజారులోనో, స్కూల్లోనో, రోడ్డు మీదనో ఎక్కడైనా పడుకోవడం మొదలుపెడితే.. అలా చాలా రోజులు నిద్రపోతూనే ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది శాస్త్రవేత్తలు ఈ గ్రామానికి సంబంధించిన మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించినప్పటికీ, ఇప్పటి వరకు ఎవరూ ఈ నిద్ర రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఈ నిద్రను ఒక ప్రత్యేక రకమైన వ్యాధి అని చెబుతున్నారు. అయితే.. సరైన వాదనకు ఎటువంటి బలమైన సాక్ష్యాలను శాస్త్రవేత్తలు చూపించలేకపోతున్నారు.

కారణాలు ఇవి అయి ఉండొచ్చా…

కజకిస్తాన్‌లోని ఈ గ్రామానికి సమీపంలో ఒక యురేనియం గని ఉండేదని, అది ఇప్పుడు మూసివేసినట్లు తెలుస్తోంది. ఈ గని నుంచి విషపు రేడియేషన్ వచ్చేది. దీని కారణంగా ప్రజలు ఇలాంటి వింత వ్యాధి బారిన పడ్డారని కొంతమంది వాదిస్తుంటారు.

అయితే ఇప్పుడు ఈ గ్రామంలో ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో రేడియేషన్ లేదు. అయినప్పటికీ .. ఈ వ్యాధికి కారణం యురేనియం గనులు కాదని పరిశోధకులు అంటున్నారు… ఈ నిద్ర రుగ్మతకు కారణం ఇక్కడ నీటిలోని కార్బన్ మోనాక్సైడ్ వాయువని వాళ్ల మాట.. అందుకనే ఇక్కడ ప్రజలు నెలల తరబడి నిద్రపోతారని పరిశోధకులు అంటున్నారు.. కానీ శాస్త్రీయ కారణాలు మాత్రం సరైనవి చూపించడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఈ గ్రామం కూడా మిస్టరి గ్రామంగా మిగిలిపోయింది.

సరైన కారణాలు ఇంకా తెలియలేదు కానీ.. వీళ్లు మాత్రం ఇలా నిద్రపోతూనే ఉన్నారు.! ఈ గ్రామం మిస్టరీగానే ఉండిపోయింది.!

 

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news