Russia- Ukraine war: వీధుల్లోనే కుళ్లుతున్న మృతదేహాలు.. ప్రబలుతున్న కలరా

-

మూడు నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు కూడా తగ్గడం లేదు. యుద్దంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే రాజధాని కీవ్ తో సహా ఖార్కీవ్, మరియోపోల్, సుమీ వంటి నగరాలు ధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా మరియోపోల్ నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడటంతో నగరం పూర్తిగా దెబ్బతింది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణం దెబ్బతినడంతో పాటు రష్యా దాడిలో మరణించిన ప్రజలు మృతదేహాలు ఇంకా వీధుల్లోనే ఉన్నాయి. దీంతో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి, కలరా వ్యాధి ప్రబలుతోందని అక్కడి మేయర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో దాదాపుగా 287 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మరియోపోలో నగరంలోనే 24 మంది చిన్నారులు మృతి చెందారు. మొత్తం 492 మంది పిల్లలు గాయాలపాలైనట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్, డాన్ బాస్ ప్రాంతంలో రష్యా దాడుల చేస్తోంది. దాదాపుగా ఉక్రెయిన్ లోని 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news