తెల్లోల్లను తెగ ఆకట్టుకుంటున్న ఇండియా చాయ్ ఇదే..

-

తెలుగు రుచులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మన దేశ రుచులకు మంచి డిమాండ్ ఉంది.. భారత సంప్రాదాయలు, ఆహారం అంటే పడి చచ్చి పోతారు..ఈ పాయింట్ ను క్యాష్ చేసుకోవడం చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడ తెలుగు రుచులతో నోరూరించే రకరకాల వంటలకు సంభందించిన హోటల్స్‌ స్టార్ట్ చేస్తున్నారు.పిజ్జాలు, బర్గర్‌లు తినే అమెరికన్‌లు సైతం ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ మన వంటకాల్ని లొట్టలేసుకుంటూ ఆవురావురుమంటూ తింటున్నారు..

దేశంలోనూ స్ట్రీట్‌ ఫుడ్‌లను అందించడంలో భారత్‌ రెస్టారెంట్‌లే బాగున్నాయంటూ కొనియాడుతున్నారు.. మొత్తానికి మన తెలుగు వాళ్ల రుచులు మాత్రం భలే బాగున్నాయన్న టాక్ ను అందుకున్నాయి.ఇకపోతే ఇప్పుడు మరొక తెలుగు రెస్టారెంట్‌ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.ఆ రెస్టారెంట్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మెహెర్‌ వాన్‌ ఇరానీ భారతీయ వంటకాలన్నీ అమెరికన్‌లకు రుచి చూపించేందుకు 2009లో అమెరికా నార్త్‌ కరోలినా యాష్‌లో ‘చాయ్‌ పానీ’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కేవలం 8 డాలర్ల నుంచి 17డాలర్ల మధ్య ధరలతో చాట్‌ను అందించడంతో ఆ రెస్టారెంట్‌కు భారత్‌, అమెరికన్‌లకే కాదు వివిధ దేశాలకు చెందిన ఫుడ్‌ లవర్స్‌ను ఆకట్టుకుంది. మనదేశంలో విరివిరిగా లభ్యమయ్యే మసాలల్ని దట్టించిన చాట్‌లలో షడ్రుచులు తోడవవ్వడం అమెరికాలో 1946 నుంచి సంప్రాదాయ వంటకాల్ని అందించే బ్రెన్నాన్స్‌ వంటి హోటల్స్‌ ను చాయ్‌ పానీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది..

ఈ టీ ధర తక్కువ, రుచికరమైన వంటకాల్ని అందించడంతో చాయ్‌ పానీ ఫుడ్‌ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో 40 ఏళ్లలో ఎన్నుడూ చెల్లించిన విధంగా అమెరికన్‌లు ఆహరం కోసం ఈ ఏడాది అత్యధికంగా చెల్లిస్తున్నారు. అదే సమయంలో రీజనబుల్‌ ప్రైస్‌లో చాయ్‌ పానీ వంటకాలు లభ్యం కావడంతో అమెరికాలో బెస్ట్‌ రెస్టారెంట్‌గా ప్రసిద్దికెక్కింది. జేమ్స్‌ బియర్డ్‌ ఫౌండేషన్‌ అవార్డ్స్‌ సొంతం చేసుకొని మొదటి స్థానంలో నిలిచింది..ఇది తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం అని చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news