రాష్ట్రపతి ఎన్నికలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. ఎలాగైనా గెలవాలని!

-

జాతీయ పార్టీ ప్రకటన విధి విధానాలపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. బుధవారం పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. జాతీయ స్థాయిలో రాజకీయంగా రాణించాలని సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దూరంగా ఉంటున్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే సమావేశాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. మొదట్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కే.కేశవరావు నేతృత్వంలో టీఆర్ఎస్ బృందాన్ని పంపాలని కేసీఆర్ నిర్ణయించారు. కానీ ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి టీఆర్ఎస్ దూరం పాటిస్తోంది. అయితే కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా సమావేశం నిర్వహించాలని మమతా బెనర్జీని సీఎం కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news