కోనసీమ ఎస్పీపై బదిలీ వేటు.. మొత్తం ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో చెలరేగిన హింసను ముందస్తుగా గుర్తించకపోవడంతో అక్కడ ఏస్పిగా పని చేస్తున్న ఎస్పీ సుబ్బారెడ్డి ని బదిలీ చేశారు. అతడిని మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్ గా నియమించారు. గత నెలలో కోనసీమలో జరిగిన అల్లర్లు, విధ్వంసం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే ఆ రోజున జరిగిన రాళ్ల దాడిలో ఎస్పీ సైతం గాయపడ్డారు. అక్కడ కనీసం వారిని వారిన్చేందుకు పోలీసు సిబ్బంది లేరనే విమర్శలున్నాయి. తాజాగా డీజీపీ అమలాపురం లో పర్యటించారు. నాటి పరిస్థితులు విచారణ తీరుపై ఆయన ఆరా తీశారు. ఇప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఆయన స్థానంలో కొత్తగా ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు.

అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ గా కొనసాగుతున్న సిద్ధార్థ కౌశల్ బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీగా పి. జాషువా ను నియమించారు. విజయవాడ డీసీపీగా విశాల్ గున్ని నియమితులయ్యారు. కర్నూలు ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news