విజ‌య్ అన్నంత ప‌ని చేశాడు!

-

కోలీవుడ్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజ‌య్‌. తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాదిరి త‌మిళంలో విజ‌య్. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి సీనియ‌ర్ల‌ని ప‌క్క‌న పెడితే నెక్ట్స్ త‌రంతో విజ‌య్ ని అగ్ర న‌టుడిగా భావిస్తారు. ర‌జ‌నీకాంత్ త‌ర్వాత ఆ స్థాయిలో త‌న సినిమాల‌తో క‌లెక్ష‌న్ల రికార్డులు సృష్టించ‌డం విజ‌య్‌కే సాధ్య‌మ‌నే నానుడి ఉంది. అయితే విజ‌య్ త‌న కెరీర్‌లో ఎక్కువ శాతం సీనియర్‌ డైరెక్టర్స్‌తోపాటు బాగా అనుభవం ఉన్న దర్శకులతోనే పనిచేస్తార‌నే కామెంట్ త‌ర‌చూ వినిపిస్తుంటుంది. కొత్త వారిని ప్రోత్స‌హించ‌ని త‌ర‌చూ విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య్ ఇటీవ‌ల ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

Vijay gives chance to young director

కొత్త ద‌ర్శ‌కులు, ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ద‌ర్శ‌కుల‌కు ఛాన్స్ లు ఇస్తాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అప్‌ కమింగ్‌ డైరెక్టర్స్‌తో వర్క్‌ చేసేందుకు సిద్ధమే అని తెలిపారు. ‘మంచి కథతో నన్ను మెప్పించి, సినిమాని బాగా తీయగలమనే నమ్మకాన్ని కలిగించిన దర్శకులతో సినిమాలు చేసేందుకు నేను సిద్ధ‌మే’ అని అన్నారు. విజ‌య్ అన్న‌మాట‌ని సీరియ‌స్‌గానే తీసుకున్న కొంత మంది యువ ద‌ర్శ‌కులు ఆయ‌న్నిక‌లిశార‌ట‌. అలా వచ్చిన ఓ దర్శకుడికి విజయ్ ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. లోకేష్‌ కనగరాజ్‌ అనే యువ ద‌ర్శ‌కుడు చెప్పిన స్క్రిప్ట్ కి విజ‌య్ బాగా ఇంప్రెస్‌ అయి త‌న త‌దుప‌రి సినిమాకి ద‌ర్శ‌కుడు త‌నే అని డిసైడ్‌ చేశార‌ట‌. దీంతో ఆనందంతో ఎగిరి గంతేయ‌డం ఆ డైరెక్ట‌ర్ వంతైంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇది విజ‌య్ న‌టిస్తున్న 63వ చిత్రం. ‘థెరి’, ‘మెర్సల్‌’ వంటి సూప‌ర్ హిట్స్ తర్వాత వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. స్పోర్ట్స్‌ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఆయ‌న పాత్ర గెస్ట్ కే ప‌రిమిత‌మా? నిజంగానే విల‌న్‌గా విశ్వ‌రూపం చూపిస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ సినిమా అనంతరం ఈ ఏడాది ద్వితీయార్థంలో లోకేష్ చిత్రం షురూ అవుతుంద‌ట‌. దీంతో విజ‌య్ అన్నంత ప‌ని చేశార‌ని, కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని త‌మిళ చిత్ర వ‌ర్గాలే కాదు, ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీ అవుతున్నార‌ట‌. లోకేష్‌ గతంలో’మానగరం’, ‘అవియల్‌’, ‘ఖైతి’ చిత్రాలను రూపొందించి ద‌ర్శ‌కుడిగా తానేంటే నిరూపించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news