చ‌ల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ.. ఇలా చేయండి..!

-

ఓ వైపు ఎండ‌లు దంచి కొడుతున్నాయి. మ‌రోవైపు వేస‌వి తాపానికి జ‌నాలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండ‌ల‌కు వ‌డ‌దెబ్బ త‌గిలి కొంద‌రు మృత్యువాత కూడా ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ధ్యాహ్నం పూట బ‌య‌ట‌కు రావాలంటేనే జ‌నాలు జంకుతున్నారు. వ‌చ్చినా.. చ‌ల్ల‌ని మార్గాల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే శీత‌ల పానీయాలను తాగ‌డం కూడా ఎక్కువైపోయింది. అయితే ఎండ‌లో నుంచి వ‌చ్చిన వారు చల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ తాగితే వేస‌వి తాపం నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మనం పొంద‌వ‌చ్చు. దీంతోపాటు శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం కూడా ల‌భిస్తుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. మ‌రి కీర‌దోస ల‌స్సీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

కీర‌దోస ల‌స్సీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

కీర‌దోస కాయ‌లు – 2
పెరుగు – అర లీట‌ర్
అల్లం – 2 అంగుళాల ముక్క
కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు
ప‌చ్చిమిర‌ప కాయ‌లు – 2
చ‌క్కెర – 4 టేబుల్ స్పూన్లు
ఇంగువ – చిటికెడు
ఉప్పు – తగినంత

కీర‌దోస ల‌స్సీని త‌యారు చేసే విధానం:

కీర‌దోస‌కాయ ముక్క‌లు, అల్లం, కొత్తిమీర‌, ప‌చ్చిమిర‌ప కాయలు, చ‌క్కెర, ఇంగువ‌, ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి బాగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ప‌ట్టుకోవాలి. అందులోనే పెరుగు కూడా వేసి మళ్లీ మెత్త‌గా ప‌ట్టాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని గ్లాసులో పోస్తే చాలు.. కీర‌దోస ల‌స్సీ త‌యార‌వుతుంది. అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చ‌ల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీని తాగ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news