చదువు లేకున్నా కూడా తెలివి ఉంటే చాలు ఎక్కడైనా బ్రతికేయచ్చు..ఈ మధ్య కరోనా మిగిల్చిన పరిస్థితుల కారణంగా చావు తెలివి తేటలు పెరిగాయి. చాలా మంది చిన్న ఆలోచనతో అద్బుతాలను సృష్టిస్తున్నారు.తాజాగా ఓ రైతు వినూత్న ఆలోచన చేశారు..ప్రపంచం ఎంత ముందుకు వెళుతున్న రైతులు మాత్రం అక్కడే ఉన్నారు.ఒక పంటను పండించాలి అంటే ఎంతో కష్ట పడాలి..శాస్త్రీయ యుగంలో వ్యవసాయానికి అతిపెద్ద యంత్రాలు వినియోగిస్తున్నా కానీ, నేటికీ కొన్ని చోట్ల పేద రైతులు సంప్రదాయ వ్యవసాయం చేస్తూ చాలా కష్టపడి పని చేస్తున్నారు.
నేలను సారవంతం చేయడం నుండి, విత్తనాలు విత్తడం, పంటలు పండించడం వరకు అదో యజ్ఞంలాంటిది. అయితే, కొందరు రైతులు తమలోని సృజనాత్మకతను వ్యవసాయ పనుల్లో బయటపెడుతుంటారు. తమ టెక్నీక్ ఉపయోగించి కొత్తవిధానాలను రూపొందిస్తున్నారు.కొంత మంది మాత్రం చాలా సులువుగా చేస్తారు.
ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇందులో ఒక వ్యక్తి గోధుమ పంట పండిస్తున్నాడు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు అతడు ఓ టెక్నిక్ ఉపయోగించాడు. ఏపుగా పెరిగిన గోధుమ గడ్డిని కోసేందుకు అతని చేతిలో ఓ విచిత్ర పరికరం ఉంది. దాంతో అతడు ఒకసారి అడ్డంగా ఊపేస్తున్నాడు.. అంతే, గోధుమగ్గి ఆ యంత్రానికి ఉన్న గంపలాంటి లోతైన ప్రదేశంలోకి వచ్చేస్తోంది. ఇక దాన్ని వరుసక్రమంలో పక్కకు పెట్టేస్తున్నాడు. అదేదో, ఈగలు, దోమల్ని తోలినంత ఈజీగా అతడు తన సాధనంతో పంటను కోస్తున్నాడు..అందుకు సంభందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూడండి..
Between tradition and modernity.
Harvest wheat.😃😃😃 pic.twitter.com/gbv0oaFLyf— Tansu YEĞEN (@TansuYegen) June 15, 2022