సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు స్పందించారు. కొత్త నియామకాల పద్ధతి యువతకు బంగారం లాంటిదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. త్వరలో నియామకాలు చేపడుతామని, యువత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ వ్యవస్థలో యువత భాగస్వాములు కావాలన్నారు. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టిన కేంద్రం.. సైన్యంలో చేరాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశమన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ అగ్నివీరుల నియామకానికి ఈ ఏడాది వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచిందన్నారు. యువతను రక్షణ రంగంలోకి తీసుకెళ్లే అద్భుతమైన పథకం ‘అగ్నిపథ్’ అని.. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందొద్దన్నారు. 4 ఏళ్లపాటు రక్షణ రంగంలో సేవలు అందించాక.. వన్‌టైన్ సపోర్ట్ ప్యాకేజీ కింద రూ.11.71 లక్షలు అందిస్తామన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వెంటనే నియామకానికి నిరుద్యోగులు సన్నద్ధం అవ్వాలన్నారు.