అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌లో పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం రెండేళ్ల కోసం రిక్రూట్ చేయడం దేనికని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఈ స్కీమ్‌లో జాబ్ సంపాదించిన విద్యార్థి నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగిలా బయటికి రావాలా? అని ప్రశ్నించారు.
ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఏ దశలో భర్తీ చేస్తారని భూపేశ్ భగల్ తెలిపారు. ఒకవేళ పోలీసు దళంలోకి వాళ్లను తీసుకోకుంటే.. అప్పుడు ఏం జరుగుతుందని అడిగారు. తక్కువ సమయంలో వాళ్లకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. ఆ తర్వాత నిరుద్యోగులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. యువతను మధ్యలో వదిలేస్తే.. నేరగాళ్లుగా, అల్లరిమూకలుగా తయారవుతారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేశభద్రతను ఎలా కాపాడుతారని సీఎం భగల్ ప్రశ్నించారు.