వచ్చే నెల మొదటి వారంలోనే ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందనుంది.ప్రభుత్వం డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది, ఆ తర్వాత కనీస బేసిక్ వేతనం పెరుగుతుందనే అంచనాలు మరింత పెరిగాయి. ప్రభుత్వం డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది, ఆ తర్వాత కనీస బేసిక్ వేతనం పెరుగుతుందనే అంచనాలు మరింత పెరిగాయి.ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లు పెంచాలని, తద్వారా కనీస మూల వేతనాన్ని రూ. 18,000 నుంచి రూ.26,000కి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం గతంలో 2017 సంవత్సరంలో ఎంట్రీ లెవల్ బేసిక్ పేని నెలకు రూ.7,000 నుండి రూ.18,000కి పెంచింది.
కేంద్ర ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తే,వారి జీతం పెరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కింద 2.57 శాతం వేతనం లభిస్తుండగా, దానిని 3.68 శాతానికి పెంచితే కనీస వేతనం రూ. 8 వేలు పెరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ.26,000కి పెరగనుంది.. మినిమమ్ జీతం.. 18 వేలకు పైగానే ఉంటుంది.
జూన్ 2017లో 34 సవరణలతో ఏడవ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించింది. ఎంట్రీ లెవల్ బేసిక్ జీతం నెలకు రూ. 7,000 నుంచి రూ. 18,000కి పెంచగా, అత్యున్నత స్థాయి అంటే సెక్రటరీ రూ. 90,000 నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. క్లాస్ 1 అధికారులకు ప్రారంభ వేతనం రూ. 56,100 ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల HRA త్వరలో 3 శాతం పెరగవచ్చు. X కేటగిరీ నగరాల్లోని ఉద్యోగులు వారి హెచ్ఆర్ఏలో 3% పెరుగుదలను చూడవచ్చు, అయితే Y కేటగిరీ నగరాల్లో వారి అలవెన్సుల్లో 2% పెరుగుదల కనిపించవచ్చు. ఇది కాకుండా, జెడ్ కేటగిరీ నగరాల్లో ఉద్యోగుల హెచ్ఆర్ఎ కూడా 1 శాతం పెరగవచ్చు. అంటే ప్రభుత్వోద్యోగుల హెచ్ఆర్ఏ 27 శాతం నుంచి 30 శాతానికి పెరుగనుంది.. మొత్తానికి వచ్చే నెలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.. మరి ప్రభుత్వం చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఇస్తుందెమో చూడాలి..