రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి.. తపన పడుతన్నాయని.. చేతిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఉంచుకుని వేరే వారిని వెతుక్కోవడం దేనికి..? అని నిలదీశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి. ఉప రాష్ట్రపతులు.. రాష్ట్రపతులు అయిన సంప్రదాయం మన దేశంలో ఉంది… వెంకయ్యనాయుడుది మచ్చ లేని జీవితమని కొనియాడారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ఎన్డీఏ ప్రకటించాలని.. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అభ్యర్థి అయితే అన్ని పార్టీలూ సహకరిస్తాయని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును నిలబెడితే ఏకగ్రీవం అవుతుందని.. రాష్ట్రపతి ఎన్నికలను ఇంతగా కంట్రావర్సీ చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతిపక్షాలు రోజుకో పేరును ప్రతిపాదిస్తాయి.. వాళ్లేమో మేం పోటీ చేయం అంటారు… వెంకయ్యనాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకుంటే దేశ గౌరవం మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.