ఈ పుస్తకాన్ని మంటల్లో వేసినా చెక్కుచెదరట..! వేలంలో పెడితే రూ. కోటిపై మాటే.।!

-

మన పూర్వీకులు తాళపత్ర గ్రంధాలు వాడేవాళ్లు.. చూడ్డానికి తాటాకు ముక్కల్లా ఉండే వాటిల్లో.. చాలా ముఖ్యమైన విషయాలు రాసేవారు. వాటి ఆధారంగానే..ఎన్నో రహస్యాలను ఛేదించవచ్చని పెద్దోళ్లు అంటుంటారు.. వీటిపై సినిమాలు కూడా తీశారు. తాళపత్ర గ్రంథాలు తర్వాత రాగిరేకులు వచ్చాయి. వీటిపై రచనలు చేశారు. ఇక అలా అలా పేపర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇక ఏది రాయాలన్నా..పేపర్‌ మీదే. అయితే ఏదైనా కాలంగడిచే కొద్ది మారుతూ ఉంటాయి. చెదలుపట్టో, తడిచిపోయే లేక ఏదైనా అగ్నిప్రమాదం వల్లనే నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కదా..! అందుకే సాఫ్ట్‌ కాపీ ఉంచుకోవాలి అంటారేమో..! ఆ సంగతి పక్కన పెడదాం.. ఇక్కడ ఓ ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్‌ ఏంటంటే.. మనం చెప్పుకుబోయే ఈ బుక్‌ మంటల్లో వేసినా కాలదట. చాలా విచిత్రంగా ఉంది కదూ.. ఇంతకీ ఏంటా బుక్‌, ఎందుకు కాలదో చూద్దామా..!

మార్గరెట్‌ అట్వుడ్‌ రాసిన ‘ది హ్యాండ్‌ మెయిడ్స్ టేల్’ అనే క్లాసిక్‌ నవలని ప్రత్యేకమైన ఫైర్‌ఫ్రూఫ్‌ మెటీరియల్‌ని ఉపయోగించి ప్రింట్‌ చేశారు. సినీఫాయిల్, ప్రత్యేకమైన అల్యూమినియం మెటీరియల్‌తో ఈ బుక్‌ను తయారు చేశారట. ఈ అన్‌బర్నబుల్ బుక్ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా.. కీలకమైన కొన్ని కథలను రక్షించాల్సిన ఉద్దేశంతో దీనిని రూపొందించారని సమాచారం..ఈ పుస్తకం వేలంలో కోటి రూపాయలకు పైనే పలికింది.ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును.. స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం వాదించే ‘పెన్‌ అమెరికా’ సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారట.

బుక్‌లో ఏం రాశారు..

ఇది స్త్రీ ద్వేషం, అణిచివేతకు గురవుతున్న మహిళలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించే డిస్టోపియన్ నవల. అంతేకాదు అత్యధికంగా అమ్ముడైన నవల కూడా ఇదేనట. ఈ అన్‌బర్నబుల్ బుక్ ఆఫ్ ది హ్యాండ్‌మెయిడ్స్ ‘పెన్‌ అమెరికా’ కోసం చాలా డబ్బులు సేకరించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ పుస్తక రచయిత అట్వుడ్‌ అన్నారు. 2200 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉష్ణోగ్రతలో కూడా ఈ పుస్తకం చెక్కుచెదరదని, పైగా ఓ ప్రత్యేకమైన ఇంక్‌తో దీనిని ముద్రించినట్లు బుక్‌ డిజైనర్లు వెల్లడించారు. ఒక కెనడా రచయిత ఫ్లేమ్‌ త్రోవర్‌తో ఈ పుస్తకాన్ని కాల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news