రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

-

రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వనుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జోక్యం తో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనేక చర్చల తర్వాత శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశంలో విపక్ష నేత యశ్వంత్ సిన్హా ను ఏకగ్రీవంగా అంగీకరించారు.

వారంతా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఈ నెల 15న సమావేశమయ్యారు. కానీ పోటీకి మొదట ఎంపిక చేసిన అభ్యర్థులు నిరాకరించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నే పోటీ పడాలని మమతాబెనర్జీ ఒత్తిడి తెచ్చిన ఆయన ఒప్పుకోలేదు. అయితే ఈ సమావేశానికి ఆహ్వానం అందిన అప్పటికీ సీఎం కేసీఆర్ గానీ టిఆర్ఎస్ ప్రతినిధి గానీ హాజరు కాలేదు. దాంతో ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకుంటుందన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సీఎం కేసీఆర్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news