ఉత్కంఠ రేపుతున్న ‘కార్తికేయ-2’ ట్రైలర్…

-

చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ కథనాయకుడిగా వచ్చిన సినిమా కార్తికేయ. ఈ సినిమా ఊహించని బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో నిఖిల్‌ హీరోగా, అనుపమ పరమేశ్వర్‌ జంటగా కార్తికేయ-2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ సినిమాను పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండగా మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ”కార్తికేయ 2” ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆసక్తికర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ మరియు గ్లిమ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

Nikhils Karthikeya 2 trailer

లేటెస్టుగా విడుదలైన ‘కార్తికేయ 2’ ట్రైలర్ ప్రేక్షకులకు ఒక మిస్టీరియస్ థ్రిల్లింగ్ ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు హామీ ఇచ్చింది. ‘ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం అక్కడ మళ్లీ మొదలయింది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలవు’ అనే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news