8 యేళ్లు గా నా భార్య, కుటుంబానికి దూరంగా ఉన్న పృథ్వి.. ప్రస్తుతం డాన్సర్ తో ఇలా..!!

-

 సినీ ఇండస్ట్రీలో నటుడిగా పేరు పొందిన పృథ్వీ అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయ్యారు అని చెప్పవచ్చు. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయంగా కూడా ఎంట్రీ ఇచ్చి, సినీ ఇండస్ట్రీలో ఉండే వారి పైన కూడా ఘాటుగా స్పందించారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ నటుడు. ఇక ఈయన సినిమాలు, రాజకీయాల విషయం కాస్త పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక రహస్యాన్ని బయటపెట్టారు.Telugu Actor Prudhvi Raj Met With An Accident - Filmibeat

2023 లో రిలీజ్ చేస్తానన్న ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని.. తన జీవితంలో ఉన్న ఆమె గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాదులో ఉన్నదని ఆమె వరంగల్ నుంచి చెన్నై కి మైగ్రేట్ అయ్యారని అప్పటినుంచి తనకు బాగా పరిచయం ఉందని తెలిపారు. తను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నప్పటి నుంచి డబ్బులు ఇచ్చేవారు. 20 ఏళ్లుగా తన బిడ్డ లతో సమానంగా ఆదరిస్తున్నారు నేను బతికి ఉన్నానంటే కారణం ఆమె అని తెలియజేశారు.

ఇక ఆమె పేరు దాసరి పద్మ రేఖ. వరంగల్ నుంచి చెన్నైకి వెళ్లిపోయారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి తనకు బాగా తెలుసునని.. సినీ రంగంలో ఆమె డాన్సర్ గా పని చేశారు.. ఆ తర్వాత హైదరాబాద్ కి రావడం జరిగిందని తెలిపారు. ఇక వాళ్ళ తాతగారు కూడా తనకి బాగా తెలుసు అని వాళ్లకు ఏ సమస్య వచ్చినా కూడా నేను వెళ్తాను.. నాకు ఏ సమస్య వచ్చినా కూడా సహాయం చేస్తారని తెలిపారు. అంతేకాకుండా లొకేషన్ కి కూడా భోజనం పంపిస్తూ ఉంటారని తెలిపారు. ప్రస్తుతం తను నా పక్కనే ఉన్నది అని తెలిపారు. దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఫ్యామిలీ లైఫ్ దూరంగానే ఉన్నాను కానీ నా పిల్లలని బాగా చూశాను. వాళ్ళు ఒక స్టేజ్ లో సెటిల్ అయ్యారు. నా భార్య మాత్రం విజయవాడ లోనే ఉన్నది. గొడవలు ఇప్పటికీ సద్దుమణగలేదు ఆ వ్యవహారం ఇంకా కోర్టులోనే నడుస్తున్నది అని తెలిపారు పృధ్వీ. ఇంతలా ఓపెన్ గా మాట్లాడే వ్యక్తి నటుడు పృథ్వీ ఒక్కడే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news