శ్రీకాకుళం : 43 లక్షలా 96 వేలమంది తల్లులకు, రూ. 6595 కోట్లు నేరుగా ఖాతాలలోకి వేస్తున్నామని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి. మీ కుటుంబాల భవిష్యత్ ను పిల్లల చదువులలో చూసుకుంటున్న తల్లులకు , పిల్లలకు బెస్డ్ విసెస్ చెబుతున్నానని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.
కుటుంబం, దేశం తలరాతలు మార్చగలిగేది ఒక్క చదువేనని.. చదువులు ఎక్కువ ఉన్న దేశాలలో ఆదాయాలు ఎక్కువ అన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉండటానికి కారణం చదువు అని.. చదువే నిజమైన అస్తి. చదువుపై ఖర్చు చేసే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడి, ఒకతరాన్ని , తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని వెల్లడించారు.
ప్రపంచంలో ఎక్కడికైనా వెల్లి బ్రతికే సత్తా , చదువుతోనే వస్తుందని.. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే మిన్నగా మన పిల్లల చదువులు ఒక హక్కుగా అందాలని ముందుకు వెలుతున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి. అమ్మ ఒడి , నాడు నేడు , విద్యాకానుక , గోరుముద్ద , బై జ్యుస్ ఒప్పంద అన్నీ పిల్లల బవిష్యత్ కొసం తిసుకు వచ్చిన పధకాలే అని చెప్పారు.