గ్యాంగ్‌రేప్.. లిఫ్ట్ ఇచ్చి తల్లి, ఆరేళ్ల కూతురిపై అత్యాచారం!

దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. నిర్భయ లాంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో గ్యాంగ్ రేప్ జరిగింది. హరిద్వార్‌లోని రూర్కీలో ఓ మహిళ, ఆరేళ్ల కూతురిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కారులో అత్యాచారం
కారులో అత్యాచారం

మహిళ తన ఆరేళ్ల కూతురుతో కలిసి అర్ధరాత్రి పిరాన్ కలియార్ నుంచి ఇంటి వెళ్తోంది. సోను అనే వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత సోను.. అతని స్నేహితులు మహిళ, కుమార్తెపై అత్యాచారం చేశారు. ఆమె కారులో ఎక్కినప్పుడు సోనుతోపాటు కొందరు స్నేహితులు ఉన్నారని ఎస్పీ ప్రమేంద్ర దోవల్ తెలిపారు. కదులుతున్న కారులోనే తల్లీకూతురిపై అత్యాచారం చేశారన్నారు. అనంతరం కాలువ దగ్గర పడేశారన్నారు.

అర్ధరాత్రి సమయంలో మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. బాధితురాలిని రూర్కీ సివిల్ ఆస్పత్రికి తరలించామన్నారు.