TRS బంద్ అయ్యి BRS రావాలని నాకు ఆత్రుతగా ఉంది: ఎంపీ ధర్మపురి అరవింద్

-

ఆదివాసి మహిళా రాష్ట్రపతి కాకుండా టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేస్తుందని మండిపడ్డారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆదివాసి బిడ్డను రాష్ట్రపతి చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదని.. కానీ చేసి చూపించామని అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు తొలిమెట్టుగా మారాయన్నారు.

అంతేకాదు కాంగ్రెస్, టిఆర్ఎస్ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని అన్నారు. బిఆర్ఎస్ ఎక్కడ పోయిందో సమాధానం చెప్పాలని ఎద్దేవాచేశారు. టిఆర్ఎస్ బంద్ అయ్యి బిఆర్ఎస్ రావాలని నాకు ఆత్రుతగా ఉంది అని అన్నారు ధర్మపురి అరవింద్. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కి భూమి కేటాయించి ఉంటే ఇప్పటికే అది పూర్తయ్యే అని ఫైర్ అయ్యారు. భూమి కేటాయించని వీళ్ళు విభజన హామీల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ తెలంగాణలో లేకుండా పోయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news