Breaking : రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

-

తెలంగాణ విద్యాశాఖ నేడు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రేపు డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్‌ దరఖాస్తు ప్రక్రియకు నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్‌ ఫ‌లితాల‌ను సైతం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు అధికారులు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌వేశాల కోసం దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌లకు కసరత్తులు మొదలయ్యాయి.

telangana degree counselling 2020: TS: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్‌.. రేపటి  వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు - dost telangana admission 2020:  telangana degree counselling self ...

రాష్ట్రంలోని ప‌లు కాలేజీల్లో ఉన్న బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం ఆన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో దోస్త్‌ ద్వారా ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. అయితే విద్యార్థులు ఈ నోటిఫికేషన్‌ ఆధారంగా కాలేజీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. నేడు విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. ఈ సారి కూడా బాలికలు విజయ దుందుభి మోగించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news