Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం..హీరోయిన్ మీనా భర్త కన్నుమూత..

-

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ అగ్ర హీరోయిన్ నటి మీనా భర్త హఠాన్మరణం చెందారు. గత ఏడాది నుంచి కొవిడ్‌ సమస్యలతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది గంటల క్రితమే కన్నుమూశారు.తెలుగుతో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన మీనా 2009 సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో కలిసి పెళ్లిపీటలెక్కారు. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. దలపతి విజయ్ హీరోగా వచ్చిన పోలీసోడు సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది.

కాగా, విద్యాసాగర్‌ గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. దీనికి తోడు ఈ ఏడాది జనవరిలో కరోనా బారిన పడ్డారు.ఈయన పాటు కుటుంబ సభ్యులు మొత్తం కరోనా బారిన పడ్డారు. ఈసమయంలో అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఊపిరితిత్తుల పనితీరు మరింత క్షీణించింది.

ఈక్రమంలో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యాసాగర్‌ను చేర్పించారు. అతనిని పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చేయాలనుకున్నారు. అయితే ఇది బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగుల నుంచి మాత్రమే సాధ్యమవుతందని చెప్పుకొచ్చారు. అయితే వారికి సరైన దాతలు లభించలేదు. దీంతో మందుల తోనే అతడి ఆరోగ్య పరిస్థితిని నయం చేయాలనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ మంగళవారం రాత్రి అతను కన్నుమూశారు. కాగా మీనా భర్త హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. రాధికా శరత్‌కుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు మీనా కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు…ఈరోజు ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news