పీఎస్ఎల్‌వీ సీ53 కౌంట్‌డౌన్ స్టార్ట్!

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో పీఎస్ఎల్‌వీ ప్రయోగానికి సిద్ధం అయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్‌వీ సీ53 ఉపగ్రహ నౌక ప్రయోగానికి సంబంధించి 25 గంటల కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. బుధవారం సాయంత్రం 4.02 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ.. గురువారం సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి వదలనున్నారు. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్‌వీ)సీ53 నింగిలోకి ప్రవేశించనుంది. ఈ ప్రమోగంతో సింగపూర్‌కు చెందిన డీఎస్ ఈఓ అనే ఉపగ్రహం (365 కేజీలు), న్యూసార్ అనే ఉపగ్రహం (155 కేజీలు), స్కూబ్-1(2.8 కేజీలు) అనే ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి.

PSLV C53
PSLV C53

ఇస్రో ఇప్పటికే ఎన్నో పీఎస్ఎల్‌వీ ప్రయోగాలు చేసింది. వాణిజ్యపరంగా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించింది. దీంతో పీఎస్ఎల్‌వీ ప్రయోగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2016లో పీఎస్ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా ఏకంగా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి రికార్డు సృష్టించింది. అలాగే వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపడంలో భారత్ ముందంజలో ఉంది. దీంతో చాలా దేశాలు భారత్ నుంచే పీఎస్ఎల్‌వీ ఉపగ్రహాలను పంపేందుకు మొగ్గుచూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news