హైదరాబాద్‌ కొత్త కలెక్టర్‌గా అమయ్‌ కుమార్‌..

-

ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎల్‌.శర్మన్‌ పదవి విరమణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్ గా అమయ్ కుమార్ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆయనకు హైదరాబాద్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. అమయ్ కుమార్ నియామకానికి సంబంధించి నిన్న రాత్రి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Emblem of Telangana - Wikipedia

ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ గా అమయ్ కుమార్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. మరొకరికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేంత వరకు అమయ్ కుమార్ ఈ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తారు. ఇదిలా ఉంటే.. నేటి నుంచి హైదరాబాద్‌లో ఆషాడ మాస బోనాలు ప్రారంభం కానున్నాయి. నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news