గారపట్టిన పళ్లకు అరటిపండు తొక్కతో ఇలా చేస్తే ముత్యాల్లా మెరవాల్సిందే..!  

-

ముఖంలో కళ్లు, పళ్లు చాలా ముఖ్యమైనవి. అమ్మాయిలకు కలువరేకుల్లాంటి కళ్లు, ముత్యాలాంటి పళ్లు ఉంటే చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఇక పాప నవ్విందింటే.. రాలిన ముత్యాలు ఏరుకోవాల్సిందే. అదే పసుపుగా గారపట్టి, కావటీస్‌తో ఉంటే ఎంత లిప్‌స్టిక్‌ వేసినా ఏం ఉపయోగం ఉండదు. కూల్‌డ్రింగ్‌, కాఫీలు విపరీతంగా తాగడం వల్ల పళ్లు డామేజ్‌ అవుతాయి. పళ్లను తెల్లగా మార్చుకోవడానికి స్పెషల్‌గా ఏం టూత్‌పేస్ట్‌లు ఉండవు. టీత్‌ వైటినింగ్‌ చేసి గారతొలగిస్తారు. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని. కొన్ని హోమ్‌రెమిడీ ద్వారా..కరుడుకట్టిన గారను మొత్తం తీసేయొచ్చు. మిలమిల మెరిసే పళ్లకోసం..మీ టిప్స్‌ ఓసారి ట్రే చేయండి.!
అరటిపండు, ఉప్పు, టూత్‌ పేస్ట్‌, పావు టీ స్పూన్‌ పసుపు తీసుకుని పక్కనపెట్టుకోండి. ముందుగా ఒక అర‌టి పండును తీసుకుని దాని నుంచి తొక్కను తీయండి. మనకు తొక్కతోనే పని. తొక్కకుండే తెల్లని గుజ్జును గిన్నెలో తీసుకుని.. అందులో ఉప్పు, పావు టీ స్పూన్ ప‌సుపును, టూత్ పేస్ట్‌ను వేసి బాగా కలుపుకుని మిశ్ర‌మాన్ని తయారు చేసుకోవాలి. అంతేకాకుండా దీనిని ఒక గంట పాటు పక్కన పెట్టుకొని వాడుకుంటే ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు.
తయారు చేసిన టూత్ పేస్ట్ మిశ్ర‌మాన్ని ప్రతి రోజూ దంతాలను శుభ్రం చేసే ముందు 3 నిమిషాల పాటు పళ్లకు మర్ధన చేయాలి. అంతేకాకుండా దీనిని రాత్రి పడుకునే ముందు కూడా దంతాలకు పట్టిస్తే దంత సమస్యలు తొలగిపోతాయట. దంతాలు ముత్యాలలా మెరిసిపోతాయి. చిగుళ్లు దృఢంగా మారి.. అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మిశ్రమంలో ఉండే గుణాలు నోట్లో ఉన్న బాక్టీరియాను అంతమొందిస్తాయి. చిగుళ్లు, నోటి స‌మ‌స్య‌ల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
రిజల్ట్‌ పక్కా ఉంటుంది కాబట్టి..కాస్త శ్రమ అనుకోకుండా..ఈ చిట్కాలు పాటిస్తే.. పళ్లు పచ్చగా లేకుండా మల్లెపువ్వుల్లా మారిపోతాయి మరీ..! ఏవేవో చేసి అలిసిపోయి ఉంటారు.. మరీ ఆఖరి ప్రయత్నంగా ఇది కూడా ట్రే చేసేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news