టిఆర్ఎస్, బిజెపిల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది – వైయస్ షర్మిల

-

ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా హుజూర్ నగర్ లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి, కేసీఆర్ అవినీతిని ప్రశ్నించని బిజెపిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు షర్మిల. టిఆర్ఎస్ ఇస్తానన్న ఇంటికో ఉద్యోగం ఏమైంది? బీజేపీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? నిరుద్యోగులను ఎన్నికల్లో ఎరలా వాడుకుంటున్నారు తప్ప ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం లేదని నిప్పులు చెరిగారు.

Sharmila
Sharmila

ప్రభుత్వ ఆస్తులు అమ్మటం, రేట్లు పెంచి ప్రజలను దోచుకోవడం కెసిఆర్, మోదీకే చెల్లిందని అన్నారు. అంతేకాదు కెసిఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని పదేపదే మాట్లాడుతున్న బిజెపి లీడర్లు వాటిని ఎందుకు బయట పెట్టడం లేదో సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు నడుస్తున్నాయని అన్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ మరియు టిఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news