ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 7వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన తాడేపల్లి నుండి బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. అక్కడ 9:30 కి విమానంలో బయలుదేరి 10: 20 కి కడప చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాఫ్టర్లో బయలుదేరి పులివెందుల వెళతారు. పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కాసేపు విశ్రాంతి తీసుకొని స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పులివెందులలో నిర్వహిస్తున్న న్యూ టెక్ బయో సైన్సెస్ కు శంకుస్థాపన చేస్తారు.
అక్కడి నుండి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో వేంపల్లి వెళ్తారు. వేంపల్లి లోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం 5:30 కి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. జూలై 8 వ తేదీ ఉదయం 8 గంటలకు వైఎస్ఆర్ ఘాట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుండి 9: 10 కి కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 10:30 కి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్లీనరీ సమావేశంలో చేరుకుని అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు.