ముగిసిన సికింద్రాబాద్ అల్లర్ల సూత్రధారి ఆవుల సుబ్బారావు కస్టడీ

-

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు తో పాటు మరో ముగ్గురికి కస్టడి ముగిసింది. ఆవుల సుబ్బారావు తో పాటు అతడి ముగ్గురు అనుచరులను రెండు రోజులపాటు రైల్వే పోలీసులు ప్రశ్నించారు. ప్రధాన సూత్రధారిగా ఉన్న ఆవుల సుబ్బారావును ఘటనకు సంబంధించిన పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు.

ఘటన జరిగే ముందురోజు సికింద్రాబాద్ లోనే ఉండి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టే ప్రయత్నం లేదని, రైల్వే స్టేషన్ విధ్వంసం సంబంధించి వ్యూహాలను రచించడం, విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి వారిని ఉసిగొల్పే విధంగా ప్రేరేపించడం వంటి అంశాలపై ఆరా తీశారు. అయితే తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సుబ్బారావు విచారణలో చెప్పినట్లు తెలిసింది. కస్టడీ ముగిసిన అనంతరం సుబ్బారావు తో పాటు మరో ముగ్గురిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news