పాలేరు పోరు: షర్మిలకు కలిసొస్తుందా?

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల….నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తున్నారో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే..వైఎస్సార్ అభిమానులు ఎక్కువ ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీకి దిగాలని షర్మిల ఫిక్స్ అయ్యారు…అయితే అక్కడ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలని ఎదురుకుని షర్మిలకు గెలిచే సత్తా ఉందా? పాలేరులో షర్మిలకు అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటి? వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏంటి? అనేది ఒకసారి చూసుకుని ముందు..అసలు పాలేరు నియోజకవర్గం గురించి తెలుసుకోవాలి.

1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొదట నుంచి కమ్యూనిస్టుల హవా ఉండేది…సి‌పి‌ఎం పార్టీ ఇక్కడ సత్తా చాటుతూ ఉండేది. తర్వాత కాంగ్రెస్ ఫామ్ లోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్, సి‌పి‌ఎంల మధ్య వార్ నడిచేది. ఇక 1999 ఎన్నికల నుంచి పాలేరులో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది…నిదానంగా కమ్యూనిస్టుల బలం తగ్గుతూ రావడంతో కాంగ్రెస్ పుంజుకుంది…అక్కడ ఎక్కువగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు.

1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలిచింది…మధ్యలో కాంగ్రెస్ నేత మరణంతో 2016లో ఉపఎన్నిక రాగా, అప్పుడు టీఆర్ఎస్ తరుపున తుమ్మల నాగేశ్వరావు గెలిచారు. మళ్ళీ 2018లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి..టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి.

ఇదే క్రమంలో షర్మిల..వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు..అయితే ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువ…పైగా రెడ్డి వర్గం హవా ఉంది…దీంతో షర్మిల అక్కడ బరిలో దిగడానికి రెడీ అయ్యారు. అలాగే పాలేరు టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు ఉన్నాయి…ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు పడటం లేదు..ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. అలాగే కాంగ్రెస్ లో కాస్త నాయకత్వం బలహీనంగా ఉంది…అదే సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొంతమంది…షర్మిలకు సహకరించే పరిస్తితి కనిపిస్తోంది.

ఇప్పటికే షర్మిల అక్కడ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు..టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని వైఎస్సార్టీపీలోకి తీసుకొస్తున్నారు. అటు బలమైన రెడ్డి వర్గం నాయకుల మద్ధతు కూడా పెంచుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ కమ్యూనిస్టులని తక్కువ అంచనా వేయకూడదు…ఒకవేళ వచ్చే ఎన్నికల్లో షర్మిల..కమ్యూనిస్టులని కలుపుకుంటే విజయానికి ఢోకా ఉండదు. అయితే బలమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ లని నిలువరిస్తేనే షర్మిల విజయం సాధ్యం. మొత్తానికైతే పాలేరులో షర్మిల విజయావకాశాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news