ఏపీలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున భూమి కంపించడంతో ఇళ్లలోని సామాగ్రి కిందపడటం, మంచాలు కదలడంతో ఇళ్లలోని వారంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కడప జిల్లా బద్వేలు మండలంలోనూ భూమి కంపించిందని విద్యానగర్, చిన్నకేశంపల్లి గ్రామస్థులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఐదు సెకన్లపాటు భూమి కంపించిందని గ్రామస్థులు వెల్లడించారు. అయితే దీనిపై అధికారులు నివేదిక అందించనున్నారు.
రెక్టార్ స్కేల్‌పై ఎంత మేరకు దీని ప్రభావం ఉందనిది ఇంకా అధికారులు వెల్లడించలేదు. అయితే.. ఓ పక్క భారీ వర్షాలతో సతమతమవుతున్న ఏపీ ప్రజలకు ఈ భూకంపంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో వాకులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు అధికారులు.