కంచుకోటలో ‘కారు’కు పంక్చర్లు..సగం డ్యామేజ్!

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట…టీఆర్ఎస్ ఆవిర్భావం దగ్గర నుంచి ఇక్కడ ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇక 2014, 2018 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ సత్తా చాటింది. మొత్తం 12 స్థానాలు ఉన్న కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ హవా నడుస్తుంది…గత ఎన్నికల్లో 12 సీట్లకు 10 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. మంథని సీటు కాంగ్రెస్, రామగుండంలో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే నెక్స్ట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి వచ్చారు.

దీంతో టీఆర్ఎస్ బలం 11కు చేరుకుంది. అయితే ఎప్పుడైతే కరీంనగర్ పార్లమెంట్ లో బీజేపీ నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలిచారో..అప్పటినుంచి సీన్ మారిపోయింది…అక్కడ బీజేపీ హవా మొదలైంది. పైగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ వీడి బీజేపీలోకి వచ్చి మళ్ళీ హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో టీఆర్ఎస్ బలం 10కి పడింది.  అయితే నిదానంగా టీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం, అలాగే ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు జరగడం బాగా మైనస్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ సగం సీట్లు గెలుచుకోవడం కష్టమే అని తెలుస్తోంది.

జిల్లాలో టీఆర్ఎస్ ఓటమి అంచున ఉన్న నియోజకవర్గాలు వచ్చి…ధర్మపురి, మానుకొండూరు, వేములవాడ, పెద్దపల్లి, రామగుండం, చొప్పదండి. ఈ ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. అలాగే ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు కూడా ఎక్కువగానే ఉంది. ఇవే కాదు ఇంకా టీఆర్ఎస్ చేతుల్లో లేని హుజూరాబాద్, మంథని ల్లో కూడా కారు నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ కరీంనగర్ అసెంబ్లీలో గాని బండి సంజయ్ పోటీ చేస్తే…మంత్రి గంగుల కమలాకర్ విజయం కూడా డౌటే. మొత్తానికైతే కంచుకోట లాంటి కరీంనగర్లో కారుకు గట్టిగానే డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news