సమంతకు ఎవరి సాయం అక్కర్లేదు..‘యశోద’ డైరెక్టర్ సంచలన కామెంట్స్!

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత..బాలీవుడ్ ఫిల్మ్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా ఓకే చేసింది. సమంత నటించిన ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది.

ఈ క్రమంలోనే ఆమె మరో పాన్ ఇండియా ఫిల్మ్ కు ఓకే చెప్పేసింది. వెరీ డిఫరెంట్ జోనర్ లో వస్తున్న ఆ చిత్రానికి ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. అది కూడా ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ కావడం విశేషం. ‘యశోద’ టైటిల్ తో వస్తున్న ఈ పిక్చర్ లో..సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సమంత లుక్స్ ..సినిమాపైన అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర దర్శకులు హరి శంకర్, హరీశ్ నారాయణ్ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కోసం కమర్షియల్ గా ఆలోచించబోని హీరోయిన్ కావాలని ప్రయత్నించామని, ఈ క్రమంలోనే తమకు సమంత దొరికిందని చెప్పుకొచ్చారు.

ఈ వెరీ డిఫరెంట్ స్టోరిని సమంతకు నెరేట్ చేస్తున్న టైమ్ లోనే నిమిషాల వ్యవధిలోనే ఆమె ఓకే చేసిందని గుర్తు చేసుకున్నారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలలో ఎవరి సాయం లేకుండా సమంత ఫైట్ సీక్వెన్సెస్ చేసిందని, సమంతకు ఎవరి సాయం అక్కర్లేదని తెలిపారు. ఎవరి హెల్ప్ తీసుకోకుండా అత్యద్భుతంగా సమంత యాక్షన్ సన్నివేశాలు చేసిందని వివరించారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్, వెంకట్ మాస్టర్లు కంపోజ్ చేసిన ఫైట్స్ సమంత..అలవోక గా చేసేసిందని కొనియాడారు దర్శక ద్వయం హరి-హరీశ్.

 

Read more RELATED
Recommended to you

Latest news