నేడు పాలిసెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా పాలిసెట్‌కు సంబంధించిన కౌన్సిల్ షెడ్యూల్‌ను సైతం అధికారులు విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 20 నుంచి 23వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుందని, ధృవపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు 20 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. 27న సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు.
27 నుంచి 31వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు.. ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని. త్వరలో పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాలను https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చని వెల్లడించారు. అయితే.. ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన
ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6న సీట్ల
కేటాయింపు జరగనుంది.