బిజినెస్ ఐడియా: మీరు విలేజ్లో ఉంటున్నారా? ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే..

-

విలేజ్ లో ఉండేవారికి సొంత పొలం ఉంటుంది.. దాంతో మంచి వ్యాపారాలు చెయ్యొచ్చు..మీకు పట్టణ ప్రాంతంలో స్థలం ఉన్నా ఈ వ్యాపారాన్ని ప్రారంభించి లక్షల్లో సంపాదించవచ్చు..నిజంగా గుడ్ న్యూస్ కదా..ఆ వ్యాపారాల గురించి ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకుందాం..

కరోనా కారణంగా ఎంతో మంది ఉద్యోగాలను పోగొట్టుకొని సిటీలలో ఉండలేక సొంత ఊర్లకు వెళ్ళిపోయారు.. అలాంటి వాళ్ళు అక్కడే వ్యాపారాలు చేయాలనీ అనుకోవడం సహజం.అందుకే మీ కోసం బెస్ట్ బిజినెస్ ఐడియా ను తీసుకొచ్చాము..అదే కోళ్ల వ్యాపారం. దీనిని మొదలు పెట్టడానికి కనీసం రూ. 5 నుంచి రూ.9లక్షలు ఖర్చు అవుతుంది..15 నుంచి 20గుంటల స్థలం అవసరం అవుతుంది. చిన్న స్థాయి నుండి అంటే 1500 కోళ్ల నుండి లేయర్ ఫార్మింగ్ ప్రారంభిస్తే, మీరు నెలకు 50 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. ముందుగా స్థలం, పంజరం, సామగ్రికి దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

1500 కోళ్ల లక్ష్యం నుంచి పనులు ప్రారంభించాలంటే ముందుగా.. 10 శాతం కోళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కోళ్లను ఒక్కసారే కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే కోళ్ల ఫారమ్ లో కోళ్లు ఒత్తిడికి లోనయి చనిపోయే ప్రమాదం ఉంటుంది..ఒక లేయర్ పేరెంట్ బెర్త్ ధర దాదాపు రూ. 30 నుండి రూ. 35. అంటే కోళ్లు కొనేందుకు రూ.50 వేలు బడ్జెట్ ఉంచుకోవాలి. ఇప్పుడు వాటిని పెంచేందుకు రకరకాల ఆహారపదార్థాలను కొనాల్సి వస్తుంది. వాటితో పాటు.. వివిధ రకాల మెడిసిన్ లకు కూడా ఖర్చు అవుతుంది..

20 వారాల పాటు కోళ్లకు మేత ఖర్చు 1 నుంచి 1.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒక లేయర్ పేరెంట్ పక్షి సంవత్సరంలో దాదాపు 300 గుడ్లు పెడుతుంది. 20 వారాల తరువాత, కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించి ఒక సంవత్సరం పాటు గుడ్లు పెడతాయి.ఆహారం మరియు పానీయాల కోసం సుమారు 3 నుండి 4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. 1500 కోళ్ల నుండి సంవత్సరానికి సగటున 290 గుడ్లు సుమారు 4,35,000 గుడ్లు లభిస్తాయి. వీటిని అమ్మడం వల్ల 14 లక్షల ఆదాయం వస్తుంది.
కోళ్ల పెంపకంలో వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది. కోళ్లను వ్యాధుల నుండి రక్షించుకోవాలి. లేకపోతే పెద్ద నష్టం జరగవచ్చు. ఇలా చిన్నగా వ్యాపారం ప్రారంభించి,గుడ్లు,కోళ్లను అమ్ముకొని మంచి లాభాలను పొందవచ్చు..అన్ని ఖర్చులు పోగా నెలకు లక్ష రూపాయలు లాభం పొందవచ్చు.. మీకు ఇలాంటి ఐడియా ఉంటే కానివ్వండి..కొన్ని సంస్థలు కోళ్లను ఇచ్చి బిజినెస్ ను పెంచమని రుణాలు కూడా ఇస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news