సాదారణంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలని రూల్ ఉంది..ఎందుకంటే ఏదైనా భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఏం జరగకుండా కాపాడుతుంది. కానీ నాలుగు చక్రాల వాహనాలలో వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? ఓ డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది.
బస్ డిపోకు చెందిన ఆ బస్సు డ్రైవర్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలు హెల్మెట్ ధరించిన కారణం తెలిస్తే మీరు షాకవుతారు.రోడ్డుపై వెళ్తున్న బస్సును ఓ వ్యక్తి వెంబడించి మరీ వీడియో తీశాడు. ఆ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి.
దాని వల్ల గాయాలబారిన పడకుండా, వర్షం, గాలి నుంచి రక్షణ కోసం ఇలా డ్రైవర్ హెల్మెట్ ధరించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం లోని బాగ్‌పత్ సరిహద్దులో ఈ సంఘటన జరిగింది.ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో బస్సును ఢీకొట్టటం వల్ల ముందు అద్దాలు పగిలిపోయాయని డ్రైవర్ చెప్పినట్లు వెల్లడించారు.. మొత్తానికి ఈ చిత్రాలు మాత్రం నెట్టింట తెగ ట్రోల్ అవుతుంది..
Picture of UP Roadways bus clicked in Baghpat pic.twitter.com/0hkJAimkfG
— Piyush Rai (@Benarasiyaa) July 17, 2022