పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.
అయితే ఈ లైగర్ సినిమా తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ గా కనిపించాడు. విజయ్ దేవరకొండ తో పాటు రమ్యకృష్ణ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. టీజర్ ను మించిపోయి ఈ ట్రైలర్ ఉంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అందరికీ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.