94 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. ఎందుకంటే?

-

ఇటీవల సోషల్ మీడియాల్లో నకిలీ వార్తల వ్యాప్తి ఎక్కువైంది. దీంతో నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్లను నిషేధించిన కేంద్రం.. తాజాగా మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. 2021-22 మధ్యకాలంలో 94 యూట్యూబ్ ఛానళ్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 యూఆర్ఎల్ వెబ్‌సైట్లపై నిషేధం విధించింది.

యూట్యూబ్
యూట్యూబ్

దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2020 ప్రకారం.. గతేడాది ఫిబ్రవరి 25 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news