మీ ఫోన్‌ పోయిందా? అయితే ఫోన్ పే,గూగుల్ పే యాప్స్ ను ఇలా బ్లాక్ చెయ్యవచ్చు..

-

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు..అందరు కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ను వాడుతారు..ఫోన్ పే చాలా మంది వాడుతూ ఉంటారు. గూగుల్ పే కూడా దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. పేటీఎం కూడా అందరూ వాడుతూనే ఉంటారు. ఇలా ఈ యాప్స్ వాడే వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ యాప్స్ ద్వారా సులభంగా క్షణాల్లో ఇతరులకు డబ్బులు పంపొచ్చు. ఒకవేళ ఫోన్ పోతే? ఏం చేయాలి. భారీగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఫోన్‌కు లాక్ లేకపోతే మాత్రం ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది.ఇక కేటుగాళ్ళ చేతికి ఫోన్ దొరికితే ఇక అంతే..

మీ ఫోన్ పోతే మీరు వెంటనే ఒకపని చెయ్యాలి..గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటివి వాడుతూ ఉంటే.. ముందుగా ఈ అకౌంట్లను బ్లాక్ చేయాలి. మీరు తాత్కాలికంగా లేదంటే పర్మనెంట్‌గా ఈ అకౌంట్లను బ్లాక్ చేసుకోవచ్చు. అప్పుడు మోసగాళ్లు మీ యూపీఐ యాప్స్‌ను ఉపయోగించలేరు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా ఉండొచ్చు. ఈ యాప్స్‌ను ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ పే వాడే వారు 18004190157 నెంబర్‌కు కాల్ చేసి అకౌంట్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. ఇది కస్టమర్‌ కేర్ నెంబర్. కాల్ చేసిన తర్వాత అదర్ ఇష్యూస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత స్పెషలిస్ట్‌తో మాట్లాడాలనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అకౌంట్ బ్లాక్ చేయాలని తెలియజేయాలి. దీని కన్నా ముందే మీరు మీ గూగుల్ అకౌంట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ వద్దనుకుంటే మీ వద్ద ఇంకో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే.. రిమోట్‌ విధానంలో కూడా మీరు మీ ఫోన్‌లోని డేటాను డిలేట్ చేసుకోవచ్చు. android.com/find ద్వారా మీరు మీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఎరేజ్ డేటా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌లోని డేటా మొత్తం డిలేట్ అయిపోతుంది..

01204456456 నెంబర్‌కు కాల్ చేసి ఫోన్ పోయిందనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు వేరే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మిస్ అయిన ఫోన్‌లో ఉన్న నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీరు డివైజ్‌లలోనూ పేటీఎం నుంచి లాగ్ ఔట్ అవుతారు. తత్కాలికంగా అకౌంట్ బ్లాక్ చేయాలని భావిస్తే.. అప్పుడు పేటీఎం వెబ్‌సైట్‌లోకి వెళ్లి 24 గంటల హెల్ప్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఫ్రాడ్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు పేటీఎం మీ అకౌంట్‌ను బ్లాక్ చేస్తుంది..

ఇక ఫోన్ పే వాడుతున్న వారు అయితే..08068727374 లేదా 02268727374 నెంబర్లకు కాల్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడటానికి ప్రయత్నించాలి. మీరు మొబైల్ నెంబర్, చివరి ట్రాన్సాక్షన్ వివరాలు, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. తర్వాత మీ అకౌంట్‌ బ్లాక్ అవుతుంది..ఇలా చెయ్యకుంటే మాత్రం చాలా నష్ట పొవాల్సి వస్తుంది..ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news