విమానం నుంచి చేప పిల్లలను చెరువులోకి వదిలారు..!

-

వాట్ యాన్ వీడియో సర్‌జీ. వీడియో చూస్తుంటేనే ఆ చేపలను లటక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. అంత ముద్దుగా ఉన్నాయి ఆ చేపలు. ఏం వీడియో. దేని గురించి మాట్లాడుతున్నారని అంటారా? అక్కడికే వస్తున్నా?

సాధారణంగా చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ చేపలను పెంచాలంటే.. చేప పిల్లలను అందులో వదులుతారు. వాటిని ఎలా వదులుతారో మీకు తెలుసా? ఏముంది ట్యాంకులో తీసుకొచ్చి ఆ నీళ్లలో వదిలేస్తారు అంటారు. అంతే కదా. అంతే కాదు.. ఇది సాధారణ పద్ధతి. కానీ.. వీళ్లు చూడండి.. చెరువులోకి చేప పిల్లలను వదలడానికి ఏకంగా విమానాన్నే ఉపయోగిస్తున్నారు. నమ్మరా? మీరు నమ్మరని తెలిసే మీకోసం వీడియో కూడా వెతికి వెతికి తీసుకొచ్చాం.

అమెరికాలోని యుటాలో కొండ ప్రాంతంలో ఉన్న ఓ చెరువులోకి విమానం ద్వారా జారవిడుస్తున్నారు. విమానం కింద పెద్ద రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా చేప పిల్లలను వదిలేస్తారు. మరి.. అంత ఎత్తునుంచి కింద పడితే వాటికి దెబ్బ తాకదా? అనే డౌట్ మీకొచ్చిందని మాకు తెలుసు. ఎంత ఎత్తునుంచి పడినా.. అవి పడేది నీళ్లలోనే కాబట్టి.. ఆ చేపలకు ఎటువంటి ప్రమాదం సంభవించదట.

ముందే మాట్లాడుకున్నాం కదా.. ఆ చెరువు కొండ ప్రాంతంలో ఉంటుందని.. అక్కడికి చేప పిల్లలను ట్యాంకుల్లో తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా మారుతోందట. అందుకే ఇలా.. కొత్త పద్ధతిలో విమానం ద్వారా చేప పిల్లలను అందులో వేస్తున్నారట. అయితే.. అంత కష్టపడి ఇదే చెరువులో ఎందుకు చేపలను పెంచడం అనే మరో డౌట్ రావాలి మీకు. వచ్చిందా.. అయితే గుడ్. కొండ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో చేపల వృద్ధి ఎక్కువగా ఉంటుందట. అంటే రాబడి ఎక్కువ అన్నమాట. కాబట్టే అంత రిస్క్ తీసుకొని విమానం ద్వారా చేప పిల్లలను తీసుకెళ్లి ఆ చెరువులో వదులుతున్నారు. ఇంతకీ.. ఆ వీడియో చూస్తారా? చూడండి.. చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news