కోలీవుడ్ స్టార్ హీరో, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రజెంట్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు అన్ని భాషల్లో దర్శకులు ఈ నటుడి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఉప్పెన’ చిత్రంతో పరిచయమైన ఈ నటుడు..ప్రస్తుతం స్టార్ గా కొనసాగుతున్నారు. కానీ, ఈయన జీవితంలో ఎదగడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయన పడ్డ కష్టాలు ఏంటీ? ఇంతకీ ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫ్యామిలీ, నేపథ్యం గురించి ఇవాళ తెలుసుకుందాం.
జనరల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగాలంటే చక్కటి అందం ఉండాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా హీరో అవాలనుకుంటే సిక్స్ ప్యాక్ తో పాటు డబ్బులు, బ్యాక్ గ్రౌండ్ ఉండాలని అనుకుంటారు. కానీ, అవేమీ లేకుండా ఎంతో శ్రమ పడి తన కాళ్ల మీద తాను నిలబడి పాన్ ఇండియా వైడ్ చక్కటి ఇమేజ్ సంపాదించుకున్నారు వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి.
తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా రాజపాలాయం గ్రామంలో పుట్టి అక్కడే చదువుకున్న విజయ్ సేతుపతి.. తాను చదువుకుంటున్న సమయంలో డబ్బుల కోసం సేల్స్ మ్యాన్, టెలిఫోన్ బూత్ ఆపరేటర్ పని చేశాడు. స్టడీస్ పూర్తి అయిన తర్వాత కుటుంబ పోషణ నిమిత్తం ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేశాడు.
విజయ్ సేతుపతికి ముగ్గురు అక్కా చెల్లెళ్లు కాగా, వారి పెళ్లిళ్ల ఖర్చుల కోసం దుబాయ్ కి వెళ్లి అక్కడ మూడేళ్ల పని చేశాడు. 2003లో తిరిగి భారత్ కు వచ్చి తన ఫ్రెండ్ తో కలిసి ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంతలో విజయ్ సేతుపతిని చూసిన దర్శకుడు బాలు మహేంద్ర…విజయ్ సేతుపతితో ‘నీ ముఖం బాగుంది’ అని చెప్పాడట.
ఇక అప్పుడు ఆయనలో నటుడు కావాలనే ఆశ కలిగింది. షార్ట్ ఫిల్మ్స్, టీవీ షోలలో యాక్ట్ చేసిన విజయ్ సేతుపతి…కార్తీక్ సుబ్బరాజ్ తో పలు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఏడేళ్ల పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. చివరకి ‘రామస్వామి నాటక’ చిత్రంతో జాతీయ అవార్డు పొందాడు.
ఆ తర్వాత ‘పిజ్జా’ ఫిల్మ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్మైలింగ్ క్వీన్ త్రిషతో ‘96’ మూవీలో నటించి, స్టార్ హీరో అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’, సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘పేటా’తో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన విజయ్ సేతుపతి.. ప్రజెంట్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. తమిళ్ లోనే కాదు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూనే మరో వైపున వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు.