దేశంలో నిత్యావసరాలు, ద్రవ్యోల్బణం, పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు తదితర అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్షాల ఆందోళన చేపట్టారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. బుధవారం కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ధరలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ముందుకు వచ్చినా.. ఎంపీలపై సన్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో సస్పెన్షన్ విధించిన ఎంపీల సంఖ్య 24కు పెరిగింది.
దీంతో సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద రిలే నిరసన దీక్ష చేపట్టారు. 50 గంటలపాటు ఈ నిరసన దీక్ష కొనసాగింది. దీనికి 20 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ నిరసనలో టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా పాల్గొన్నారు. నిరసనలో భాగంగా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే జాగారం చేశారు. గురువారం ఉదయం టిఫిన్, టీ తాగినట్లు సమాచారం.