ప్రపంచంలోనే భయంకరమైన జైల్లు.. నరమాంస భక్షులుగా ఖైదీలు..

-

మనకు బాగా బోర్‌ కొట్టినప్పుడు..చుట్టు ఉన్న పరిస్థితులు మనుషులు నచ్చనప్పుడు..’ఛీ దీనమ్మా జీవితం.. ఇంట్లో ఉన్నా జైల్లోనే ఉన్నట్లు ఉంది.. నరకంలా ఉందిరా’ అనుకుంటుంటాం. నిజానికి మనకు నచ్చని ప్రతీదాన్ని మనం నరకంలానే భావిస్తాం.. కానీ నరకం అంటే ఏంటో ఆ జైల్లలో లైవ్‌లో చూపిస్తారు. నరకంలా కాదు నరకమే..! మొత్తం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైల్లు ఇవి..ఎక్కడ ఉన్నాయంటే..

తూర్పు ఆఫ్రికాలోని రువాండా దేశంలోని గీతారామ జైలును(Gitarama Prision)భూలోక నరకం అంటారు. భూలోక స్వర్గం ఎలాగో ఇది భూలోక నరకమనమాట..! ఖైదీలను మనుషుల్లా కాకుండా జంతువుల్లా చూస్తారు. వారితో ఏదైనా చేయగలమని ఇక్కడి భద్రతా సిబ్బందికి చెప్పింది.. ఖైదీలను కొట్టడం మామూలే. అంతే కాకుండా ఖైదీలు తమలో తాము కొట్లాడుకోవడం, గొడవలు చేసుకోవడంతో పాటు చాలాసార్లు ఖైదీలు మరణించిన ఘటనలూ ఉన్నాయి..ఇక్కడ జైల్లో ఖైదీలు నరమాంస భక్షకులుగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అంటే ఒకరినొకరు చంపుకుని తిన్నారు.

సిరియా(Syria)లోని టాడ్మోర్ మిలిటరీ జైలు(Tadmor Military Jail)ఇప్పుడు ISIS చేత ధ్వంసం చేయబడింది, కానీ అంతకు ముందు ఈ జైలు చాలా ప్రమాదకరమైనది. ఇక్కడి గార్డులు ఖైదీలపై విరుచుకుపడేవారని ఓ ఖైదీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కి తెలిపారు. ఖైదీలను తాళ్లతో ఉరితీసి, చెక్క కర్రలతో కొట్టేవారంట. 2001లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఈ జైలులో నిమిషాల్లో వేల మందిని చంపినట్లు సమాచారం.

ఉత్తర కొరియాలోని నిర్బంధ శిబిరాల(Concentrarion Camp) గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఉత్తర కొరియా గురించిన విషయాలు బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం చాలా తక్కువ. శిబిరం 2012లో మూసివేయబడిందని నమ్ముతారు. అయితే శిబిరం (క్యాంప్ 22) మూసివేయబడటం చాలా మంది కేవలం పుకారు అని పిలుస్తారు. నివేదికల ప్రకారం ఇక్కడ 50,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేసినవారే. చిన్న పొరపాటుకు కుటుంబమంతా లాక్కెళ్లి అక్కడ ఉంచారు. ఆ వ్యక్తులు బతికే ఉన్నారో లేదో తెలియని పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news