కాంగ్రెస్ ను విడొద్దని రాజగోపాల్ రెడ్డిని బుజ్జగిస్తూ ఉన్నామని పేర్కొన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధిష్టానం..రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతోందని.. మేము మాట్లాడుతూ ఉన్నామని వెల్లడించారు. పార్టీ లో మీకు ఉన్న ఇబ్బందులు ఎంటి అని అడుగుతున్నామని… తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీని ఓడించే బలం కాంగ్రెస్ కే ఉందని చెప్పారు.
కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు.. తెలంగాణ ఇచ్చిన పార్టీ కి దీన్ని బాగు చేయడం ఎలా అనేది తెలుసు అని వెల్లడించారు. కాంగ్రెస్ ఎవరికి…దేనికి భయపడదని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడానికి భయం కాదు… మా పార్టీ నాయకుడిని కాపాడుకోవడం కోసం తపన అని అన్నారు భట్టి విక్రమార్క. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యే..ఆయనతో నేను..అధిష్టానం మాట్లాడిందన్నారు. సాధ్యమైనంత వరకు పార్టీలో ఉండేలా చూస్తున్నామని.. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకోలేదు కదా..? అని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.