చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్..త్వరలోనే ఆ కార్డులు..వివరాలు..

-

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తూ వస్తుంది.ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను అందించింది.కిసాన్ క్రెడిట్ కార్డ్ తరహాలోనే.. చిరు వ్యాపారులకు బిజినెస్ క్రెడిట్ కార్డులు ఇచ్చే దిశగా మోడీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దేశంలో 6.30 కోట్ల చిన్న పరిశ్రమలు, 3.31 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి. 1.5 కోట్ల కంటే తక్కువ MSMEలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాయి..

చిన్న వ్యాపారాలు చేసుకోనే నిజంగా చాలా పెద్ద ఊరట అని చెప్పాలి. దీంతో వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలు ఎలాంటి తనఖా లేకుండానే చౌకగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ, వివిధ బ్యాంకులతో ఇప్పటికే చర్చలు కూడా జరిపింది.ఈ కార్డ్ క్రెడిట్ లిమిట్ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. అంటే చిన్న వ్యాపారులు గరిష్ఠంగా లక్ష వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.
MSME మంత్రిత్వ శాఖకు సంబంధించిన Udyam పోర్టల్‌లో నమోదు చేసుకున్న వ్యాపారవేత్తలకు మాత్రమే వ్యాపార క్రెడిట్ కార్డ్‌లను ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ఎంటర్‌ప్రైజ్ పోర్టల్‌లో నమోదు చేసుకోని కోట్లాది పరిశ్రమలు ఉన్నాయి. వ్యాపార్ క్రెడిట్ కార్డ్‌ల ప్రారంభంతో.. అనేక మంది వ్యాపారులు కూడా ఎంటర్‌ప్రైజ్ పోర్టల్‌కి కనెక్ట్ అవుతారు. వ్యాపార క్రెడిట్ కార్డ్ జారీ కిరాణా దుకాణదారులకు, సెలూన్ యజమానులకు కూడా మంజూరు చేయ బడుతుంది..

కరోనా తర్వాత ఎన్నో విధాలుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్క్కొన్న సంస్థకు ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి..ఫైనాన్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్ తరహాలో చిన్న వ్యాపారులకు ‘వ్యాపార్ క్రెడిట్ కార్డ్’ని అందించాలని సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని, త్వరలోనే ఈ స్కీమ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం..

*. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వెంటనే వ్యాపారులకు ‘వ్యాపార క్రెడిట్ కార్డ్‌’లు అందిస్తారు

* MSMEలకు ఎంత పెద్ద రుణాలు ఇవ్వాలనుకుంటున్నాయనేది బ్యాంకులు నిర్ణయించుకుంటాయి.

* క్రెడిట్ కార్డుతో వ్యాపారులు మెటీరియల్, పరికరాలు కొనుగోళ్లకు చెల్లింపులు చేయవచ్చు.

* వ్యాపారం ఆదాయం పెరిగేకొద్దీ, క్రెడిట్ పరిమితి కూడా పెరుగుతుంది.

* క్రెడిట్ కార్డ్‌ల ద్వారా లాయల్టీ పాయింట్‌లు, రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్స్ ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news