జనాభా లెక్కల్లో కుల గణన చేపట్టాలి : ఎంపీ ఆర్‌ కృష్ణయ్య

-

నేడు పార్లమెంట్‌ వద్ద ఎంపీ ఆర్‌ కృష్ణయ్య ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంటు లో బీసీ బిల్లు ను ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. జనాభా లెక్కల్లో కుల గణన చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం లో ఖాళీ గా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు ఆర్‌.కృష్ణయ్య. దేశంలోని బీసీ హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 2, 3, 4 తేదీలు, ఆ తర్వాత ఆగస్టు 9,10,11 తేదీల్లో పార్లమెంట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్నాటక నుంచి పెద్ద సంఖ్యలో యువత విడతల వారీగా జరిగే ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.

R Krishnaiah demands release of police constable results

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొనబోతున్నారని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోరాటాలు చేసి విద్య, ఉద్యోగ విషయాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి హక్కులను పరిరక్షించుకున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మందికి పైగా వెనకబజిన కులాల విద్యార్థులు “ఫీజు రియంబర్స్మెంట్” ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బిసి లకు ఇలాంటి అవకాశం లేకపోవడం వల్ల యువత ఇంకా వెనుకబడి ఉన్నారన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news