బాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అడ్వాణీ. తాజాగా ‘జుగ్ జుగ్ జివో’ బ్లాక్ బస్టర్‌తో దూకుడు మీద ఉంది. ప్రస్తుతం శంకర్- రామ్‌చరణ్ పాన్ మూవీలో నటిస్తోంది. కాగా, ఆదివారం(జులై 31) కియారా పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేఫథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
1992 జులై 31న జన్మించిన కియారా.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్ ‘ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
కబీర్ సింగ్, షేర్ షా, మేజ్-2, జుగ్ జుగ్ జివో, భూల్ భులయ్య2 లాంటి వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉంది కియారా.
అడ్వాణీ సినిమా ఇండస్ట్రీలోకి రావడంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హస్తం కూడా ఉంది.
కియారా కుటుంబం.. సల్మాన్ కుటుంబం చాలా క్లోజ్ అంట. బాంద్రాలో ఇరు కుటుంబాలు నివసిస్తున్న సమయంలో.. మంచి అనుబంధం ఉండేదట.
కియారా అడ్వాణీ తల్లి జెనీవీవ్ జాఫ్రీ.. సల్మాన్ ఖాన్ బాల్య స్నేహితులు అట. తాను హీరో అవుతానని తరచూ.. జాఫ్రీకి చెప్పేవాడట సల్మాన్ ఖాన్.
అంతేకాదు.. కియారా అడ్వాణీ ఆంటీ షాహీన్‌తో కూడా సల్మాన్ డేటింగ్ చేసినట్లు అప్పట్లో బీటౌన్‌లో గుసగుసలు వినిపించాయి.
కియారా అడ్వాణీ అసలు పేరు ఆలియా అద్వానీ. కియారా ఇండస్ట్రీకి వచ్చే సమయానికి ఆలియా పేరుతో అప్పటికే ఆలియా భట్ ఉంది. ఈ క్రమంలో ఆమె స్క్రీన్ నేమ్ మార్చాలని సల్మాన్ సూచించారు.
సల్మాన్ ఖాన్ సూచన మేరకు ఆలియా పేరు.. కియారా అద్వానీగా మారింది.