BIG BREAKING : TRS ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మర్డర్ ఎటాక్

-

టీఆర్‌ఎస్‌ పార్టీలో మరో సంఘటన కలకలం రేపుతోంది. ఆర్మూరు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ఆర్మూర్ కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రయత్నించాడు.

తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త… ఈ దాడికి యత్నించినట్లు సమాచారం అందుతోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులకు సమాచారం తెలిపింది ఎమ్మెల్యే సిబ్బంది.

ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. అతని వద్ద నుంచి కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ వ్యక్తిని ప్రస్తుతం బంజర హిల్స్ పోలీసులు విచారి స్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news