విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ గుడ్ న్యూస్..రూ.18,000 వరకూ స్కాలర్‌షిప్ లు..పూర్తి వివరాలు..

-

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది..2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఇందులో స్కూల్‌ పిల్లలకు, అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 దరఖాస్తులకు చివరితేది..ఆసక్తి కలిగిన వాళ్ళు ఇక ఆలస్యం ఎందుకు వెంటనే అప్లై చేసుకోండి..ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ స్కూల్‌ ప్రోగ్రాం..

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

స్కాలర్‌షిప్‌: 1-6వ తరగతి వరకు రూ.15,000, 7-12వ తరగతి వరకు రూ.18,000 చెల్లిస్తారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాం..

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్‌ చదువుతున్న వారు అర్హులు.
10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాలర్‌షిప్‌: డిప్లొమా వారికి రూ.20,000, అండర్‌ గ్రాడ్యుయేషన్‌-రూ.30,000, ప్రొఫెషనల్‌ కోర్సులు-రూ.50,000 చెల్లిస్తారు..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ పీజీ ప్రోగ్రాం..

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.

స్కాలర్‌షిప్‌: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35,000, ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులు-రూ.75,000 చెల్లిస్తారు.

కీలక సమాచారం..

ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 31, 2022
పూర్తి సమాచారం కొరకు https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecs-scholarship ఇక్కడ చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news