నాడు స్వీపర్..నేడు మేనేజర్‌.. వుమెన్ సక్సెస్ స్టోరీ..

-

కుటుంబ పరిస్థితులు కొందరికి శాపంగా మారుతాయి.. కొన్ని పరిస్థితులు మాత్రం వారిని ఎవరికీ అందంత ఎత్తులో కూర్చోబెడతాయి.చాలా మంది జీవితం ఇలానే మొదలై మంచి సక్సెస్ ను అందుకుంది..ఇప్పుడు ఓ మహిళ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..

కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. ఆమె చదువును మధ్యలోనే ఆపేలా చేశాయి. ఆ తర్వాత అవే సమస్యలు చిన్న తనంలోనే ఆమెను పెళ్లి పీటలెక్కించాయి..పెళ్ళి తర్వాత ఆమె జీవితం మారుతుందని అనుకుంది..దేవుడు చిన్న చూపు చూశాడు. భర్త ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు.ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఆమె.. పిల్లలను పోషించుకునేందుకు బ్యాంకులో స్వీపర్‌ గా చేరింది. కష్టపడి శ్రమించి.. ఇప్పుడు అదే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది.

ప్రతీక్ష.. పుణేలోని పేద దంపతులకు 1964లో జన్మించారు. కుటుంబ ఆర్థిక కారణాల వల్ల కనీసం 10వ తరగతి చదవకుండానే.. చదువును మధ్యలో ఆపేశారు. అనంతరం 16ఏళ్లకే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఆమె భర్త ముంబైలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బుక్ బైండర్‌గా ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల.. ఆమె పూణేను వీడారు. భర్తతో కలిసి ముంబైలో అడుగుపెట్టారు. భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తూమగ పిల్లాడికి జన్మనిచ్చారు.

జీవితంలో అలా సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యాక్సిడెంట్‌లో భర్త కన్నుమూశాడు. దీంతో 20ఏళ్ల వయసులోనే ఆమె ఒంటరైపోయారు. పిల్లలను పోషించాల్సిన బాధ్యతను తనపై వేసుకుని.. భర్త పని చేసే బ్యాంకు వద్దకు వెళ్లి, తన పరిస్థితి వివరించి ఏదైనా పని ఇవ్వమని కోరారు.ఆమెకు స్వీపర్ పోస్ట్ ను ఇచ్చారు.

కష్టమైనా సరే మధ్యలోనే వదిలేసిన చదువును తిరిగి కొనసాగించారు. 60శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. అదే పట్టుదలతో రాత్రి వేళ పని చేసే కళాశాలలో చేరి 12వ తరగతి కూడా పూర్తి చేశారు. అనంతరం పరీక్షలు రాసి బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగం సాధించారు. ఈ క్రమంలోనే బ్యాంకులో మెసేంజర్‌గా పని చేస్తూ తనకు ఎంతో మద్దుతుగా నిలిచిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 2004 ట్రైనీ ఆఫీసర్‌గా ప్రమోషన్ పొందిన ప్రతీక్ష.. ఒకప్పుడు స్వీపర్‌గా పని చేసిన బ్యాంకులోనే ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్‌గా నియామకం అయ్యారు.అప్పుడు స్వీపర్..ఇప్పుడు మేనేజర్ అయ్యింది..ఇది ఆమె సక్సెస్ స్టోరీ..

 

Read more RELATED
Recommended to you

Latest news